తీన్మార్ మల్లన్నను కలిసిన సాయి కుమార్ గౌడ్
– పలు అంశాలపై చర్చ
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను ప్రముఖ వ్యాపారవేత్త కూనూరు సాయి కుమార్ గౌడ్ శుక్రవారం క్యూ న్యూస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రంలో ఉన్న రాజకీయ, పరిస్థితులు, పలు రకాల అంశాలపై చర్చించారు. సాయి కుమార్ గౌడ్ కి మల్లన్న కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేరటి స్వామి యాదవ్, రాపోలు శ్రీకాంత్, కడారి అభినేష్, తదితరులు పాల్గొన్నారు.