వెల్లంకి గ్రామంలో జిల్లా స్థాయి టోర్నమెంట్ ప్రారంభం

వెల్లంకి గ్రామంలో జిల్లా స్థాయి టోర్నమెంట్ ప్రారంభం

– ప్రారంభించిన సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, ఎస్ఐ లక్ష్మయ్య

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, మరియు రామన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మయ్య ల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దారుఢ్యాన్ని కలగ చేస్తాయని, గ్రామంలోని యువకులంతా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క క్రీడోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆవనగంటి నాగేష్, ఎడ్ల నరేందర్ రెడ్డి, ఆయిటిపాముల పెద్దులు, కనతాల శశిధర్ రెడ్డి, ఎర్రోళ్ల నరసింహ, తాటిపాముల కిరణ్, గంజి భాస్కర్, ఆవనగంటి ప్రవీణ్, మధు మరియు క్రీడాకారులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking