‘విష్ణు’ చిరస్మరణీయుడు

‘విష్ణు’ చిరస్మరణీయుడు
* అందరి గుండెల్లో ఆయన నిలిచిపోతారు
* బీఆర్ఎస్ పార్టీకి, మిర్యాలగూడ పట్టణ ప్రజలకు ఆయన అందించిన సేవలు అజరామరం  తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పురపాలక సంఘ వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వర్ రావు అలియాస్ విష్ణు చిరస్మరణీయుడని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. గతనెల 26న గుండెపోటుతో విష్ణు మృతి చెందారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలో నందిపహాడ్ లోని టీఎన్‌ఆర్ గార్డెన్స్ లో ఆయన సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు. విష్ణు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి, మిర్యాలగూడ పట్టణ ప్రజలకు విష్ణు అందించిన సేవలు అజరామరమని కొనియాడారు.

అందరి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. మిర్యాలగూడ పట్టణ బీఆర్ఎస్ కు ఆయన లేని లోటు పూడ్చలేనిదని అభిప్రాయపడ్డారు. తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిబద్దత, క్రమశిక్షణతో పని చేసే విష్ణు లాంటి నేతలు యువతకు ఆదర్శమని తెలిపారు. కార్యక్రమంలో ఎమెల్సీ మంకెన కోటిరెడ్డి , మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి ,జూలకంటి రంగారెడ్డి, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ సీడీ రవి కుమార్, యువ నాయకులు గుత్తా అమిత్ రెడ్డి, బీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్దార్ధ, జిల్లా కో-ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి, అంగోతు హాతీరాం నాయక్, రైతు సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పాక్స్ చైర్మన్లు, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విష్ణు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking