బిచ్చనాయక్ భౌతిక కాయానికి శ్రద్ధాంజలి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన లావూరి బిచ్చ నాయక్ (70) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు హౌసింగ్ బోర్డు కాలనీలోని బిచ్చ నాయక్ నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందూరు వీరకోటీ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లావురి మేఘ్యా నాయక్, సీనియర్ నాయకులు పడిగపాటి పెద కోటిరెడ్డి, సర్పంచ్ లావూరి శ్రీను నాయక్, ఎంపీటీసీ లక్కీ సింగ్, కందుల నాగిరెడ్డి, పడిగపాటి శ్రీనివాస్ రెడ్డి, లావురీ కీర్య నాయక్, దస్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.