*ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కేంద్ర మంత్రి ఆర్ కె సింగ్
బాగ్ లింగంపల్లిలో ‘వికసిత్ భారత్’ సంకల్ప సభ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ లో భాగంగా శనివారం హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లిలో నిర్వహించిన సభలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమము లో కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్ కె సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమములో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ దెబాశిష్ మిశ్రా, డిప్యూటీ జనరల్ మేనేజర్ మోహన్ దాస్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ శ్రి సుబ్రహ్మణ్యం, స్ధానిక కార్పొరేటర్ శ్రీ రవి చారి తదితరులు పాల్గొన్నారు. సభ ప్రాంగణములో వివిధ బ్యాంకులతో పాటు ‘ఉజ్జ్వల’, ‘ఆధార్’ స్టాల్ లను ఏర్పాటు చేసి అర్హులైన లబ్దిదారులకు సేవలు అందించడమే మే కాక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు . ఈ సందర్భంగా 2024 కాలెండర్ తో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల పై రూపొందిoచిన బుక్ లెట్ ను, గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించిన సహాయంపై రూపొందిoచిన బ్రోచర్ ను కేంద్ర మంత్రి ఆర్ కె సింగ్ ఆవిష్కరించారు.