ఇంటింటికి అయోధ్య అక్షింతలు పంపిణి

ఇంటింటికి అయోధ్య అక్షింతలు పంపిణి

అక్షిత న్యూస్ మాడ్గులపల్లి :
మండలం మండల కేంద్రంలో మాడుగుల పల్లి గ్రామంలో శనివారం అయోధ్య రామమందిరం అక్షింతలను ఇంటింటికి తిరిగి పంపిణి చేశారు. ఈ నెల 22వ తేదినప్రధానమంత్రినరేంద్రమోడీచేతులమీదుగాఅయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్బంగా అయోధ్య రామమందిరం నుండి వచ్చిన అక్షింతలకు గ్రామస్తులు పూజలు చేసిన అనంతరం డప్పు చప్పుడులతో, పాటలతో భక్తి పరవశంతో ఊరేగింపుగా ఇంటింటికి పంపిణి చేశారు. శ్రీరాముడి విగ్రహప్రతిష్ఠనుపురస్కరించుకుని ఆరోజు అందరి ఇండ్లలో దీపాలువెలిగించాలని సూచించారు. ఈకార్యక్రమంలో గ్రామస్తులు చిలుముల వెంకట్ రెడ్డి ,నర్సిరెడ్డి,కొండయ్య,కోడూరు శీను,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking