మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు : భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని అన్నారు. నియోజకవర్గ ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలని కోరారు. సంక్రాంతి పండగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని భాస్కర్ రావు ఆకాంక్షించారు