సంక్రాంతి శుభాకాంక్షలు

మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు : బీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్దార్థ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలని కోరారు. సంక్రాంతి పండగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని నల్లమోతు సిద్దార్థ ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking