గొందళి సమాజ్ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

గొందళి సమాజ్ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన
జగదీశ్వర్ గౌడ్

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

గొందళి సమాజ్ సంఘం 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే జగదీశ్వర్ గౌడ్ ఆదివారం ఆవిష్కరించారు. గొండళి సమాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏక్ నాథ్ దున్గే ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ పాత సంవత్సరం జ్ఞాపకాలకు వీడ్కోలు పలికి నూతన సంవత్సర స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గొందళి సమాజ సంఘం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు బాష్పాక యాదగిరి, ముకయ్య,బస్సు రాము,వెంకటేష్ (దాన్),వెంకటేష్ యాదవ్,గొందళి సమాజ్ సంఘం సభ్యులు పి.సంజయ్, జి.దత్తు రావు ఏ.భగవాన్, జి.దత్తు,పి.దత్తాత్రేయ, జి.అనిల్, కే.సాయి,అంబదాస్ నితీష్ బాల్బిమ్,పండరి, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking