కొమ్మూరి ప్రతాపరెడ్డిపై సీపీఎం విమర్శలు చేయడం మానుకోవాలి

కొమ్మూరి ప్రతాపరెడ్డిపై సీపీఎం విమర్శలు చేయడం మానుకోవాలి

చేర్యాల,జనవరి 17 అక్షిత ప్రతినిధి : చేర్యాల పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ అద్యక్షులు మంచాల చిరంజీవులు మాట్లాడుతూ,చేర్యాల పెద్ద చెరువు కట్ట సుందరీకరణ పనులను గత ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమేనని,మరి అభివృద్ధి చేయడానికి జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ముందుకు వస్తే విమర్శలు ఎందుకు చేస్తున్నారో సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి సమాధానం చెప్పాలన్నారు.రాజకీయంగా ఎదుర్కోలేక పల్లా రాజేశ్వర్ రెడ్డితో కుమ్మక్కై మా నాయకుని పైన చౌకబారు విమర్శలు చేయడం మాని నియోజకవర్గ అభివృద్ధిలో మాతో పాటు భాగస్వామ్యం కావాలని కోరుతున్నామన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా జనగాం నియోజకవవర్గ అభివృద్ధికి ప్రతాప్ రెడ్డి కృషి చేస్తుంటే జీర్ణించుకోలేక ప్రజల్లో తమ ఉనికిని చాటుకోవడానికి మీరు చేస్తున్న చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, మీరు ఎన్ని విమర్శలు చేసినా జనగామ నియోజకవర్గ అభివృద్ధి భాధ్యత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దేనని అన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు తుమ్మలపల్లి సంజీవులు,మంజే మల్లేశం,కాశెట్టి ఉపేందర్, సనాది భాస్కర్, ముస్త్యాల దామోదర్,దాసరి శ్రీకాంత్, రాములు, నాగరాజు, రమేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking