పత్రికలు సమాజ హిత సూచికలు
రాష్ట్ర తహశీల్దార్ల సంఘం అసోసియేట్ అధ్యక్షుడు, వరంగల్ తహశీల్దార్ మొహమ్మద్ ఇక్బాల్
వరంగల్, అక్షిత బ్యూరో :
పత్రికలు సమాజ హిత సూచికలని రాష్ట్ర తహశీల్దార్ల సంఘం అసోసియేట్ అధ్యక్షుడు, వరంగల్ తహశీల్దార్ మొహమ్మద్ ఇక్బాల్ అన్నారు. బుధవారం స్థానికంగా అక్షిత తెలుగు జాతీయ దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పేరుకుపోతున్నటువంటి కుళ్ళు, కుతంత్రాలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వాలు, సంబంధిత బాధితులను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ వ్యవస్థలో నాలుగవ ఎస్టేట్ గా (పిల్లర్)గా విలసిల్లు తుందన్నారు. పేద, సామాన్య ప్రజల పక్షాన నిలబడుతూ ఎవరు లేని వారికి సైతం నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న అక్షిత జాతీయ తెలుగు దినపత్రిక.. ప్రజా గొంతుకై రెండు తెలుగు రాష్ట్రాల్లో నికార్సైన వార్తలను అందిస్తూ నిజాలను నిర్భయంగాప్రచురిస్తుందన్నారు. పత్రికా, టివి ఛానల్ యాజమాన్యానికి రిపోర్టర్లకు నూతన సంవత్సర 2024 కాలమానిని ప్రారంభిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల గొంతెత్తి సమస్యను చెప్పుకోలేని పేద, మధ్యతరగతి వారి గొంతుకై సంబంధిత శాఖలకు ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు వెలికితీస్తూ ప్రజల కోసం పాటుపడుతున్న అతి కొద్ది పత్రికల్లో అక్షిత జాతీయ తెలుగు దినపత్రిక,అక్షిత టివి ఛానల్ ప్రధాన భూమిక పోషిస్తున్నాయన్నారు. పత్రిక విలువలకు జర్నలిజానికి నిలువెత్తు నిదర్శనం అక్షిత తెలుగు జాతీయ దినపత్రిక అని అన్నారు. కొన్ని పత్రికలు విలువలకు తిలోదకాలిస్తూ తమకు తోచిన విధంగా వ్యవహరిస్తూ ఉన్నాయని, అటువంటి పత్రికలు మేల్కొని ప్రజా శ్రేయస్సుకు, సమాజాభివృద్ధికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలువాలని ఆకాంక్షించారు.నిజాలను వెలికితీస్తూ సమాజ చైతన్యానికి తోడ్పడాలని కోరారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులతో పాటు వరంగల్ అక్షిత బ్యూరో చీఫ్ డాక్టర్ పాలడుగుల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.