అక్షిత అక్షరం… ప్రజాయుధం
ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్
కోదాడ, అక్షిత ప్రతినిధి :
ప్రజలకు… ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజాయుధంగా అక్షిత తెలుగు జాతీయ దినపత్రిక ముందుకు సాగుతుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో అక్షిత తెలుగు జాతీయ దినపత్రిక 2024 క్యాలెండర్ ను
పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా..ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా అక్షిత అక్షర యజ్ఞం సాగిస్తుందన్నారు.

నిజాలను నిర్భయంగా… స్వేచ్ఛగా రాస్తూ ప్రజల సమస్యలకు వాస్తవ దర్పణం పడుతుందన్నారు. వివిధ ప్రధాన స్రవంతి కల్గిన పత్రికల్లో విశిష్ట సేవలందించిన అనుభవంతో చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి సారథ్యంలో గత పదిహేనేళ్లుగా అక్షిత అక్షర సమరం మోగిస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తే
ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. వాస్తవాలకు దర్పణం పట్టేలా అక్షిత అక్షర సమరం శాగిస్తుందన్నారు. అనతి కాలంలోనే పాఠకుల ఆదరణను చురగొని ప్రధాన స్రవంతి కల్గిన పత్రికలకు ధీటుగా అక్షిత వెలుగొందుతుందన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ పరిపాలన సాగుతుందన్నారు. ప్రజల వద్దకు పరిపాలన యంత్రాంగాన్ని పంపించి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆరు గ్యారంటీలను అర్హులైన ప్రజలందరికి అందజేసే ప్రక్రియ శరవేగంగా సాగుతుందన్నారు.

కాంగ్రెస్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన వెనువెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతా ఉచిత ప్రయాణ సదుపాయం, రూ. 10 లక్షల విలువైన ఆరోగ్య శ్రీ సదుపాయాలను కల్పించామన్నారు. మిగిలిన పథకాలను కూడా వంద రోజుల్లో చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా పాలన చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టే పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు అవసరమైన ప్రచారంతోనే ప్రజలకు అవగాహన కల్గుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో అక్షిత తెలుగు జాతీయ దినపత్రిక కోదాడ స్టాఫ్ రిపోర్టర్ జూలూరు బసవయ్య, వేజండ్ల శివ, కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు, కనగాల రాధాకృష్ణ, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పబ్బా గీతాదేవి, కొల్లా కోటిరెడ్డి, ఎస్కే షాబుద్దీన్, గంధం యాదగిరి, తిపిరిశెట్టి రాజు, పెండెం వెంకటేశ్వర్లు, కర్రి సుబ్బారావు డివిజన్ విలేకరులు తదితరులు పాల్గొన్నారు.