అక్క అంటే అర్ధరాత్రి కూడా పలికి పనిచేసాను*

*అక్క అంటే అర్ధరాత్రి కూడా పలికి పనిచేసాను*

*-ప్రతిపక్ష నేతల కుట్రలో కౌన్సిలర్లు పావులుగా మారవద్దు*

సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్
పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

సూర్యాపేట /అక్షిత ప్రతినిధి :

దళిత మహిళను అయినందునే ప్రతిపక్షాలు నాపై అవిశ్వాస దాడి చేస్తున్నాయని అందులో కౌన్సిలర్లు పావులు కావద్దని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళఅన్నపూర్ణ అన్నారు. అవిశ్వాసం నేపత్యంలో ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడరు. *ప్రజలకు సేవ చేయాలనే గొప్ప లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని కేసీఆర్ , కె టీ ఆర్ , మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ల ఆశీసులతో చైర్పర్సన్ పదవి వచ్చిందనీ గుర్తు చేశారు* తనను ఛైర్పర్సన్గా బలపరచిన సబ్యులకు ధాన్యావాదాలు తెలిపారు. *మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో సూర్యాపేట సమగ్ర అభివృద్ధికి విశేష కృషి చేశానన్నారు.* కరోనాలో కూడా ప్రాణాలకు నెరవక సేవలు అందించానని అందరిని కలుపుకుని సమస్యల పరిష్కారం దిశగా పనిచేశానన్నారు. ఎన్నడూ ఎవ్వరిని నిర్లక్ష్యం చేయలేదనీ
నాలుగేళ్లలో ఎన్నడూ అవిశ్వాసం మాట తేలేదన్నారు. దళిత మహిళ అయినందునే నా మీద అక్కసుతో ప్రతిపక్షాల అవిశ్వాస దాడి చేస్తున్నాయని అన్నారు. దళితురాలిని అనే కుట్రతో పదవి నుండి దింపడం న్యాయమా అని ప్రశ్నించారు. *అక్కా అంటే అర్ధరాత్రి కూడా పలికి పనిచేశానని ప్రతిపక్ష నేతల రాజకీయ కుట్రలో కౌన్సిలర్లు పావులుగా మారొద్దని తప్పుడు మాటలు , దుష్ప్రచారం నమ్మి ఆగం కావొద్దన్నారు*. దామోదర్ రెడ్డి , రమేష్ రెడ్డి , సంకినేని కి దళితుల ఆగ్రహం తప్పదనీ హెచ్చరించారు. *ఇప్పటికే దళిత మహిళ పై దాడి చేయడం ప్రజల్లో చర్చ జరుగుతుందని ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడి పరిష్కరించుకుందామని సూర్యాపేట అభివృద్ధికి అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, బి ఆర్ ఎస్ పార్టీ సూర్యాపేట పట్టణ అధ్యక్షులు సవరల సత్యనారాయణ, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బంటు చోక్కయ్య, గుండగాని నాగభూషణం, 9 వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking