క్రీడలతో మానసిక వికాసం

క్రీడలతో మానసిక వికాసం
* కుక్కడం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం
* ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

క్రీడలు మానసిక వికాసానికి దోహదపడతాయని బీఆర్ఎస్ యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ తెలిపారు. మానసిక, శారీరక దృఢత్వానికి క్రీడలే పునాది అని అన్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో మాడుగుల పల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కుక్కడం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు నల్లమోతు సిద్దార్ధ ఆదివారం బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడారు. ప్రతీ క్రీడలో గెలుపోటములు సహజమని అన్నారు. క్రీడాకారులంతా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. క్రీడాకారులంతా క్రీడల్లో పరిణితి చెంది ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతనం నుంచే క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు.
ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టిందని, గ్రామీణ ప్రాంతాల్లో ఆట స్థలాలు లేక యువత క్రీడలకు దూరమవుతున్నారని అన్నారు. ఆసక్తి, ప్రతిభ ఉన్నా సాధనకు అవకాశం లేకపోవడంతో ఎంతో మంది క్రీడాకారులు మరుగునపడిపోతున్నారని అన్నారు. యువత తెలంగాణ క్రీడా ప్రాంగణాలను సద్వినియోగం చేసుకోవాలని నల్లమోతు సిద్దార్థ కోరారు. కుక్కడం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో మొదటి స్థానంలో నిలిచిన గూడూరు గ్రామం టీమ్ కు 20 వేల రూపాయల నగదు పురస్కారంతో పాటు జ్ఞాపిక, రెండో స్థానంలో నిలిచిన కుక్కడం ఆర్గనైజర్స్ కు 15వేల రూపాయల నగదు బహుమతి, జ్ఞాపిక, మూడో స్థానంలో నిలిచిన మొలకపట్నం గ్రామం టీమ్ కి పదివేల రూపాయల నగదు బహుమతితో పాటు జ్ఞాపికలను సిద్దార్థ అందజేశారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన వారందరినీ యువనేత అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, స్థానిక సర్పంచ్ అలుగుబెల్లి గోవిందరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాబర్ట్, మాజీ ఎంపీటీసీ పద్మ, నాయకులు శ్రీను, సోములు, సాయి, మణి ,ఉదయ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking