మృతురాలి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం
– అందజేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త కునూరు సాయికుమార్ గౌడ్
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
జిల్లాలోని రామన్నపేట మండలం, బోగారం గ్రామానికి పొట్ట బత్తిని సత్తమ్మ అనారోగ్యంతో మృతి చెందగా సహృదయంతో స్పందిస్తూ బోగారం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కునూరు సాయికుమార్ గౌడ్ వారి కుటుంబ సభ్యులకు రూ.10000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేసి, మృతదేహనికి పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గోగు పద్మ సత్తయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకులు కునూరు నరేష్ గౌడ్ జేల్లా శ్రీనివాస్, రచ్చ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.