హనుమాన్ నగర్ అధ్యక్షుడిగా విఠల్

మరోమారు హనుమాన్ నగర్ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన.ఎం.విఠల్

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

కూకట్ పల్లి డివిజన్ హనుమాన్ నగర్ అధ్యక్షుడిగా మరో మారు ఎం విఠల్ ఘన విజయం సాధించారు.ఆదివారం జరిగిన హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో మూడు ప్యానల్స్ పోటీ చేయగా ఎం.విఠల్ ప్యానెల్ నుంచి అధ్యక్షుడిగా సింహం గుర్తుపై పోటీ చేసిన ఎం విఠల్,సూర్యుని గుర్తుపై ప్రధాన కార్యదర్శిగా బి.విఠల్ గెలుపొందారు. ఇతర ప్యానెల్ నుంచి పోటీ చేసిన పి.వీరేశం బుక్ గుర్త్ తో కోశాధికారిగా గెలుపొందారు.ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహకులు అధికారులు రాములు,టైల్స్ శ్రీనివాస్, ఏక్ నాథ్ దున్గే,గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులు బస్తీలో భారీ ర్యాలీ నిర్వహించి ఓట్లు వేసిన బస్తి వాసులకు కృతజ్ఞతలు తెలిపారు . బస్తీలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఆదర్శవంతమైన కాలనీ గా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టి.నరసింహులు, వెంకటయ్య, ఎర్రన్న,నర్సింహచారి, కసిమ్ యాదవ్,శంకర్,రాజేశ్వరి,లలిత కాలనీవాసులు పూలమాలలు వేసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking