రిసోర్స్ పర్సన్స్ సమస్యలు పరిష్కరించాలి

రిసోర్స్ పర్సన్స్ సమస్యలు పరిష్కరించాలి

*ప్రజావాణిలో ఎండిని కోరిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రకళ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీలలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో, పట్టణ పేదరిక నిర్ములన కార్యక్రమం (మెప్మా)లో పని చేస్తున్న రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీలు) సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం రూ.18,000లు ఇవ్వాలని రిసోర్స్ పర్సన్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జాజుల చంద్రకళ కోరారు. శుక్రవారం హైద్రాబాద్ లోప్రజవాణి కార్యక్రమంలో భాగంగా మెప్మా ఎండి కి వినతిపత్రం సమర్పంచిన అనంతరం ఆమె మాట్లాడుతూ పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని అసరోపించారు. జిఒఎంఎస్ నెంబర్ 164 ప్రకారం పిఎల్ఆర్ స్త్రీ నిధి నుండి గౌరవ వేతనం రూ.4000లు కాకుండా ప్రభుత్వం కనీస వేతనం రూ.18,000లు కనీస వేతనం ఇవ్వాలని కోరారు.

బ్యాంకుల నుండి టిఎల్ఎఫ్, టివిఎఫ్, స్వయం సహాయక సంఘాలకు రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు కె.రజిత, పద్మ, సరితనాగలక్ష్మి, మైత్రి, నాగమణి, కళావతి, లీల, విజయ, శ్రీదేవి, భాగ్యలక్ష్మి, సుధ, పుష్పలత, సౌజన్య, లక్ష్మిప్రసన్న, సుజాత, రజనిలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking