సీఎం కావాలన్న హరీష్ రావు ఆశ తేటతెల్లం

సీఎం కావాలన్న హరీశ్ రావు మనసులో మాట తేటతెల్లం 

సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్

సిద్దిపేట, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాలన్న తన మనసులోని మాటను సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బయటపెట్టారని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఎద్దేవా చేశారు. సిద్ధిపేటలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావుకు స్థానం లేదని తెలిసిపోయింది అని అందుకే బిఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎప్పటికీ ఎమ్మెల్యే లేదంటే మంత్రి గానే ఉండిపోతారు అని ఇప్పటికైనా గుర్తించు కున్నరు అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ లేదంటే కేటీఆర్ లు మాత్రమే సీఎం అవుతారని అన్నారు. మీరు చేసిన పాపాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చక్కదిద్దుతున్నట్లు తెలిపారు. పదేళ్ల పాలనలో చేసిన అప్పులు. పాపాలు. అవినీతి సరిపోలేదని ఇంకా అధికారం కోసం ఆరాటపడుతున్నారు అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయడం కాదు ముందు సిద్దిపేట ఎమ్మెల్యే గా హరీశ్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడీ హయాంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందడంతో పాటు అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు గెలిపించుకోలేక మీ పరువు కూడా పోతుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మీరు చేసిన పాపాల చిట్టా అవినీతి అక్రమాలు డొల్లతనం అంతా బయటపడిందని ప్రజలన్నీ గమనిస్తున్నారని అన్నారు. అభివృద్ధి పేరిట కెసిఆర్ హయాంలో కల్వకుంట కుటుంబం మొత్తం లక్షల కోట్లు తిన్నారని అన్నారు. ఇప్పటికైనా మీరు చేసిన పాపాలు అవినీతి ఒప్పుకొని ప్రజల ముందు లొంగిపోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గయాజుద్దీన్ ఎన్ఎస్యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ రశాద్. శ్రీకర్ దరిపల్లి అజయ్ చిన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking