గంజాయితో యువత జీవితాన్ని నాశనం చేసుకోవద్దు
బాధ్యతగల అధికారులు గంజాయికి సహకరించవద్దు
పిల్లలతల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి
గంజాయి డ్రగ్స్ తో జాగ్రత్త!
అక్షిత న్యూస్, మాడుగులపల్లి:
విద్యార్థులు యుక్త వయసులో విద్యాబుద్ధులు నేర్చుకుని, ఉన్నత విద్య, ఉద్యోగాలు సాధించాల్సిన యువత గంజాయికి అలవాటు పడి తమ బంగారు భవితను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తెస్తాడని తల్లిదండ్రులు కలలు కంటుంటే విరు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నాడు పట్టణాలకే పరిమితమైన గంజాయి భూతం నేడు గ్రామాలకు పాకింది. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ చోరీలకు పాల్పడుతూ, ఇతరుల పై దాడులు చేస్తూ ప్రమాదాలకు పాల్పడడం, ప్రేమ వ్యవహారాలు తదితర కారణాలే కాకుండా తల్లిదండ్రులను డబ్బులు అడగడం ఇవ్వకపోతే దాడులు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తుంన్నాయి. మండల పరిసర గ్రామాలలోని కొంత మంది యువత గంజాయి మత్తులో జోగుతున్నారు.

గంజాయి మాఫియా ఇంటర్, డిగ్రీ విద్యార్థులే లక్ష్యంగా కొన్ని గ్రామాలను, గ్రామ శివారులో ఉన్నగుట్టలను, అడ్డంగా చేసుకొని వ్యాపారానికి దిగారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువకులే మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మాడుగులపల్లి గ్రామ లో ఏపీజీబీ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి ఓ అధికారి మండల కేంద్రంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేసి అన్న విషయం అందరికీ తెలిసిందే ఆ ఫాస్ట్ ఫుడ్ అమ్మతో దానికి తోడు గంజాయి అమ్ముతుండడం తెలుసుకున్న పోలీస్ ఫేమస్ రాజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేస్తున్న వ్యక్తిపై కేసు చేసి వద్ద 700 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.
కొందరు యువకులు మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సిగరెట్ లోని తంబాకును దులిపేసి దాని స్థానంలో గంజాయిని నింపుకొని దమ్ము లాగిస్తూ హుక్క తరహాలో యువకులకు అలవాటు చేసింది. మత్తుకు అలవాటు పడిపోయిన యువకులు నేరాలకు అలవాటు పడిపోతున్నారు.
మత్తే ప్రపంచం..
ఒకరితో ఒకరు స్నేహం చేస్తూ గంజాయి వ్యసనాన్ని అంటురోగంగా చేసుకుంటూ మత్తే ప్రపంచంగా యువత గంజాయికి బానిసౌవుతుంది. బానిసలుగా మారిన యువకుల శరీరాకృతి సైతం మారిపోయి మానసిక రోగులుగా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. తొలి దశలో గుర్తించలేని తల్లిదండ్రులు ఆలస్యంగా తెలుసుకొని తమ పిల్లలకు కౌన్సిలింగ్ లు ఇప్పిస్తూ మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

తల్లి తండ్రులదే బాధ్యత..
యువత పక్కదారి పడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా లేకపోతే అనేక ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. పిల్లల తల్లిదండ్రులు వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. కాలేజీలకు వెళ్తున్నారా లేదా, ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనే అంశాలపై దృష్టి సారించాలి. లేదంటే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు. పిల్లల ప్రవర్తనలో ఏమాత్రం తేడా కనిపించినా తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.
మండలంలో పలు గ్రామాలలో చాక్లెట్ రూపంలో గంజాయి అమ్మడం జరుగుతుంది దాన్ని దానిని గమనించి పిల్లల తండ్రులను జాగ్రత్త వహించాలని కొంతమంది సామాజిక కార్యక్రమాలు చేసేవారు అంటున్నారు.