నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న 44 వాహనాలు సీజ్ : ట్రాఫిక్ ఏసీపీ
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరంలో నంబర్ ప్లేట్ లేకుండా చక్కర్లు కొడుతున్న 44 వాహనాలు సీజ్ చేసిన్నట్లు ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు నగరంలో నిబంధనలు అతిక్రమించి రోడ్లపై నడుపుతున్న వాహనాలపై నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ తనిఖీలో భాగంగా ఈరోజు పలు కూడళ్ళలో నెంబరు లేకుండా రిజిస్టర్ లేని వాహనాలపై కేసులకు జరిమానా విధించినట్లు తెలిపారు. నెంబరు ప్లేట్ ట్యాంపరింగ్ చేసిన స్పోర్ట్స్ బైక్ పై కేసు నమోదు చేసేందుకు ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతున్న వారు చలనాల నుండి తప్పించుకోవడంతో పాటు ట్రాఫిక్ పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ నంబర్ లోని టీఎస్ ఏపీ అక్షరాలతో పాటు చివరి రెండు నంబర్లు కనిపించకుండా స్టిక్కర్స్ ప్లాస్టర్స్ మాస్క్ లు వేస్తున్నారని తెలిపారు. కొన్ని వాహనాలకు ముందు నంబర్ ప్లేట్ కరెక్ట్ గా ఉన్నప్పటికీ వెనుక నంబర్ ప్లేట్ మాత్రం బెండ్ చేస్తున్నారని తెలిపారు.ఇలాంటి రాంగ్ నెంబర్ ప్లేట్లతో రోడ్లపై ఇష్టమొచ్చినటుగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని పెర్కొన్నారు. నంబర్ లేని బైక్స్ పై చైన్ స్నాచర్లు నేరాలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.నంబర్ ప్లేట్ లేని వికృతమైన నంబర్ ప్లేట్‌లను కలిగిన వాహనాలపై 420/511 మరియు ఎంవీ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి నెలలోనే 203 వాహనాలకు జరిమానా విధించడం జరిగిందని, మళ్లీ పునరావృతం ఆయితే కేసులు నమోదు చేస్తునట్లు తెలిపారు.