కాంగ్రెస్ పాలనతో ప్రజలకు న్యాయం
-కాంగ్రెస్ పార్టీ నాయకులు పరికపల్లి శ్రీనివాస్
ఖమ్మం/అక్షిత బ్యూరో :
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కొనిజర్ల మండల నాయకులు పరికపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. నాటి వైయస్సార్ పాలనను మరిపించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంటుందన్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు ధరణిలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన తదితర పనులతో పాటు ఆరు గ్యారెంటీ హామీలను ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని ఆయన అన్నారు.