మధుకాన్ షుగర్ ప్యాక్టరీలో మార్చి 5 న క్రషింగ్ ముగింపు
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం లో మధుకాన్ షుగర్ అండ్ పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ సీజన్ లో క్రషింగ్ మార్చి 5 న ముగించుటకు నిర్ణయిచారని యజమాన్యం ప్రకటించింది. రైతు సోదరులు తమ తమ కమతములలోని చెఱకు నరికి మార్చి 5 లోపల ఫ్యాక్టరీకి సరఫరా చేయాలని తెలిపారు.నిర్ణీత సమయములో తమ కమతముల లోని మొత్తం చెఱకును సరఫరా చేయుటకు రైతు సోదరులు పూర్తి కృషి చేయాలన్నారు.మార్చి 5 తరువాత మిగిలిన చెఱకు కు ఫ్యాక్టరీ బాధ్యత వహించదన్నారు. రైతు సోదరులు ఈ విషయమును గమనించి మీ చెఱకు సకాలములో పూర్తి చేసుకొని ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కి సహకరించాలని కోరారు.