విద్యార్థుల ఉజ్వల్ భవిష్యత్ పై పల్లా దృష్టి….!

విద్యార్థుల ఉజ్వల్ భవిష్యత్ పై పల్లా దృష్టి….!

-ప్రభుత్వ పాఠశాల్లో ఎగ్జామ్స్ కిట్ల అందజేత…!!

-టెన్త్ స్టూడెంట్స్ 10/10 జీపీఏ సాధించాలి….!!!

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆకాంక్ష…..

జనగామ, అక్షిత ప్రతినిధి:

విద్యా, వైద్యం ప్రధాన ధ్యేయంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఓ వైపు నీలిమా హాస్పిటల్ ద్వారా వైద్య సేవలందిస్తూనే మరో వైపు అనురాగ్ యూనివర్సిటీ ద్వారా విద్యనంది స్తున్నారు. ఇందులో భాగంగానే జనగామ నియోజవర్గ పరిధి సర్కారు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చేందుకు దృష్టి సారించారు. వారిని ప్రోత్సహించడంలో భాగంగా తన వంతుగా విద్యార్థులకు ఎగ్జామ్ కిట్లను అందిస్తు అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థి జీవితంలో కీలకమని, త్వరలో జరగబోయే పరీక్షలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 10/10 జీపీఏ సాధించి పాఠశాలలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు.

-విద్యార్థులు కష్టపడి కాదు..ఇష్టపడి చదవాలి:(ఎమ్మెల్యే పల్లా )…

జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉండాలంటే విద్య వల్లనే సాధ్యం..విద్యార్థులు కష్టపడి కాదు..ఇష్టపడి చదవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ సందర్బంగా పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉండాలని, తన వంతుగా పరీక్షలకు ఉపయోగపడే విధంగా మంగళ వారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజక వర్గం లోని జనగామ, బచ్చన్న పేట, తరిగొప్పుల, నర్మెట మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణి కార్యక్రమం చేపట్టారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందచేశారు..అనంతరం విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడారు. బంగారు భవితకు పునాది అయినటువంటి పదవ తరగతి పరీక్షలు బాగా రాయాలని రాబోయే రోజుల్లో మీరు కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే పల్లా కోరారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking