అమరుల త్యాగం వెలకట్టలేనిది

అమరుల త్యాగం వెలకట్టలేనిది

వర్గీకరణ సాధనే నిజమైన నివాళి

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :  మాదిగ అమర వీరుల త్యాగం వెలకట్టలేనిదని, జాతి యావత్తు అమరుల ఆశయ సాధనకు పునరంకితం కావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం ఎంఆర్ పిఎస్ జాతీయ కార్యాలయంలో జరిగిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభనుద్దేశించి ప్రసంగించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్దత సాధనే మాదిగ అమరులకు నిజమైన నివాళులన్నారు. మాదిగ అమరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ” జాతి అస్థిత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన వీరులు ఎల్లపుడూ మాదిగ ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగడం ద్వారా తప్ప మాదిగలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ది చెందడానికి మరో మార్గం లేదన్నారు. అందుకే రాజీలేకుండా పోరాటం చేస్తున్నామని అన్నారు. అయితే గత పాలకులు చేసిన మోసం, నిర్లక్షం, ద్రోహం వల్లనే మాదిగ బిడ్డలు యుద్ధంలో నేలకొరిగారని అన్నారు.

అమరవీరుల త్యాగాలు, వేలాది మంది కార్యకర్తల శ్రమ,లక్షలాది ప్రజలు పెట్టుకున్న నమ్మకం వల్ల ఎస్సీ వర్గీకరణ పోరాటం ప్రసుతం అంతిమ దశకు చేరుకుందని అన్నారు. సుప్రీం కోర్టులో జరిగిన విచారణ, అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధానమంత్రి ప్రత్యేక చొరవ చూపిన నేపధ్యంలో విజయ పిలుపు కోసమే మాదిగలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణను సాధించి మాదిగ అమరవీరులకు ఘన నివాళులు అర్పింస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మాదిగ అమరుల ఆశయ సాధన కోసం జాతి యావత్తు పునరంకితమై యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వీరులకు ఏనాడు మరణం ఉండదని, చరిత్రలో చిరస్మణీయులుగా చిరకాలంగా కీర్తించబడుతారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించేంత వరకు ఉద్యమం ముందుకు సాగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఎంఆర్ పిఎస్  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ, ఎంఎస్పి జాతీయ నాయకులు రాగాటి సత్యం మాదిగ, మాదిగ జర్నలిస్ట్ ఫోరం జాతీయ కో ఆర్డినేటర్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎంఎస్ ఎఫ్ జాతీయ అధ్యక్షులు సోమశేఖర్ మాదిగ, ఎంఎస్పి హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ ఇనుముల నరసయ్య మాదిగ, ఎంఎస్పి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు టివి నరసింహారావు మాదిగ, అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ మాదిగ, ఎంఆర్ పిఎస్ జాతీయ అధికార ప్రతినిధి బుర్ర బిక్షపతి మాదిగ, పూజలోల్ల రవి మాదిగ, ఇటిక శ్రీ కిషన్ మాదిగ, మునిరాతి అరుణ్ మాదిగ, విఎస్ రాజు మాదిగ, కుమ్మరి సత్యనారాయణ మాదిగ, కొమ్ము శేఖర్ మాదిగ, బుర్రి సతీష్ మాదిగ, రామారపు శ్రీనివాస్ మాదిగ, తుమ్మల శివప్రసాద్ మాదిగ, చండేటి వేణుగోపాల్ మాదిగ, భూపతి సుజాత మాదిగ, సూరారం సుజాత మాదిగ, వలకొల్లు రేణుక మాదిగ, వలకొల్లు రామదాసు మాదిగ,
గజ్జల రాజశేఖర్ మాదిగ, కొప్పుల సాయికుమార్ మాదిగ, దేవేందర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking