పోలియో రహిత సమాజం నిర్మించేందుకు కృషి
తిరునగర్ భార్గవ్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
పోలియో రహిత సమాజం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలని మున్సిపల్ చైర్మన్, మిర్యాలగూడ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు తిరునగర్ భార్గవ్ తెలిపారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలో 45వ వార్డు – ముత్యాలమ్మ గుడి వద్ద ఉన్న అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా తిరునగర్ భార్గవ్ మాట్లాడారు.
పోలీయో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించి వారికి బంగారు జీవితాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచి పోలియో రహిత సమాజం నిర్మించడం మనందరి బాధత్య అని పేర్కొన్నారు.

తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఇందుకోసం గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు, పౌష్టికాహారాలను ప్రభుత్వాలు అందజేస్తే వాటిని సద్వినియోగం చేసుకోవాలని తిరునగర్ భార్గవ్ సూచించారు. కార్యక్రమంలో కేస రవి, బంగారుగడ్డ యూపీహెచ్సీ డాక్టర్ సుచరిత, శ్రీనివాస్ కొంక వెంకన్న, లింగంపల్లి మట్టయ్య, ఆశా వర్కర్ నాగలక్మీ, కోల మహేష్, తదితరులు పాల్గొన్నారు.