ప్రభుత్వ పాఠశాలలే సమాజ ప్రగతికి బలమైన పునాదులు..
సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
తాను కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినేనని గుర్తు చేసుకుంటూ..
గ్రామ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి అనునిత్యం అన్నివిధాలుగా తన సహకారం అందిస్తానని హామీ..
కల్వకుర్తి అక్షిత ప్రతినిధి
వెల్దండ మండలం,చౌదర్‌పల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల యుపిఎస్ లో గ్రామ విద్యార్థులు, తల్లిదండ్రులు, యువతతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సి.ఓ.ఓ.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కార్యక్రమంలో ప్రధానంగా..విద్యా విధానం, నైపుణ్యాభివృద్ధి,ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, యువత భవిష్యత్ కార్యాచరణ,వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై విద్యార్థులు, యువత, తల్లిదండ్రులతో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రత్యక్షంగా ముఖాముఖి నిర్వహించి, వారి సందేహాలకు సమగ్ర సమాధానాలు ఇస్తూ విలువైన మార్గదర్శకత్వం అందించారు,ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతపై ప్రత్యేకంగా చర్చ జరిగింది,పాఠశాల ప్రధానోధ్యాయులు మాట్లాడుతూ.నేడు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని,అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు సేవలందిస్తున్నారని,డిజిటల్ విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు,యూనిఫారాలు,మధ్యాహ్న భోజనం, మెరుగైన మౌలిక సదుపాయాలు వంటి అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందని వివరించారు,ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ప్రతి తల్లిదండ్రి భాగస్వామి కావాలని కోరారు,తమ పాఠశాలకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అనునిత్యం సహకారం అందిస్తున్నారని,ప్రత్యేకంగా పాఠశాలకు ముగ్గురు విద్యా వాలంటీర్లను అందించడంతో పాటు,పాఠశాలకు కావలసిన మౌలిక వసతులను అందించి అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారని సుంకిరెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివి నేడు ఈ స్థాయికి చేరుకున్నాను అని తెలుపుతూ,ప్రభుత్వ పాఠశాలలో చదివితే భవిష్యత్తు ఉండదనేది పూర్తిగా అపోహ మాత్రమే, ప్రభుత్వ బడిలో చదివిన విద్యార్థులు నేడు దేశంలో అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తున్నారు,విజయం పాఠశాలను బట్టి కాదు.. విద్యార్థి పట్టుదల,కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వాన్ని బట్టి ఉంటుంది పేర్కొన్నారు, “ప్రభుత్వ బడిలో చదివిన నేను మీ ముందున్న ఉదాహరణను,అందుకే ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి,ప్రభుత్వ పాఠశాల బలోపేతం అంటే గ్రామ భవిష్యత్తు బలోపేతం, గ్రామ బడి అభివృద్ధి చెందితే గ్రామం అభివృద్ధి చెందుతుంది అని పిలుపునిచ్చారు. గ్రామ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అనునిత్యం అందిస్తానని హామీ ఇచ్చారు,విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు,విద్యా సామగ్రి,ఇతర అవసరమైన సౌకర్యాలను తన సొంత నిధుల ద్వారా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అంతేకాకుండా గ్రామ ప్రభుత్వ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులతో కలిసి పనిచేస్తానని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన ప్రతి విషయంలో తనవంతు బాధ్యత తీసుకుని ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు,పిల్లలపై మార్కుల ఒత్తిడి కాకుండా వారి ప్రతిభ, నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు,యువత ఉద్యోగ అవకాశాల కల్పనకు అనునిత్యం ఐక్యత ఫౌండేషన్ ద్వారా వివిధ రకాలైన కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామని ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అందించాలనే ఉద్దేశం తో ఉన్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు,ఈ సందర్భంగా విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు, సందేహాలు, సూచనలను సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తో పంచుకోగా,వాటికి సమగ్ర సమాధానాలు ఇస్తూ భవిష్యత్తుకు ఉపయోగపడే విలువైన మార్గదర్శకత్వం అందించారు,కార్యక్రమంలో.ఉప సర్పంచ్ రాజీవ్,వార్డ్ సభ్యులు పుష్పలత చంద్రశేఖర్ ,రమేష్ ,జంగయ్య తిరుపతయ్య ,సాయికుమార్ విజయ,శ్రీశైలం కృష్ణమ్మ, మాజీ ఉప సర్పంచ్ సింధుజ మల్లేష్,మాజీ వార్డు సబ్యులు కొండల్ యాదవ్,గ్రామ పెద్దలు పెద్దయ్య ,ఒగ్గు వెంకటయ్య లోడిగ తిరుపతయ్య బాలరాజ్, దొబ్బల బాలయ్య బాబురావు, మోహన్,లోడిగ శ్రీశైలం యువ నాయకులు భరత్, శివ, పెరుమళ్ళ శ్రీశైలం,ఒగ్గు కొండల్ తో పాటు గ్రామ పెద్దలు,ఉపాధ్యాయులు,పూర్వ విద్యార్థులు, మహిళలు,యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.