మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణంలో 30వ వార్డు కౌన్సిలర్ కుర్ర చైతన్య తల్లి లక్ష్మీరాజ్యం మృతి చెందారు. స్థానిక నేతల ద్వారా సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ…కుర్ర చైతన్య నివాసానికి చేరుకున్నారు.లక్ష్మీ రాజ్యం భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. సిద్దార్థ వెంట పూనాటి లక్ష్మీనారాయణ, సాధినేని శ్రీనివాసరావు, అబ్దుల్ కరీం, కట్కూరి శ్రీనివాస్, వింజం శ్రీధర్, అన్నపర్తి గంగాధర్, అయిల వెంకన్న గౌడ్, దుర్గాప్రసాద్, సత్యం తదితరులు ఉన్నారు.