మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలి
మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని. ప్రమీల
కోదాడ, అక్షిత ప్రతినిధి :
సృష్టికి మూలం మహిళా అని మహిళలు విద్య ఉద్యోగ రాజకీయ సామాజికంగా ఎదగాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని.ప్రమీల అన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కమిషనర్ రమాదేవితో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. నేటి సమాజంలో పురుషులతో పాటు సమానంగా మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో ఆడ, మగా అనే వివక్ష చూపకుండా పెంచాలని అన్నారు. ఓర్పు, సహనం మహిళలకు వరం లాంటిది అన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రేమ, ఆప్యాయతలు చూపి పిల్లలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ లు మున్సిపల్ మహిళ కౌన్సిలర్లను మహిళా పారిశుద్ధ్య కార్మికులను , ఆర్పీల ను, మున్సిపల్ మహిళ ఉద్యోగులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అనంతరం వివిధ సంఘాల మహిళా మణులు ముఖ్య అతిథులను కూడా గౌరవంగా సత్కరించారు మహిళలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొల్లా.ప్రసన్న లక్ష్మీ , తిపిరిశెట్టి. సుశీల, మేదర. లలిత, కట్టెబోయిన. జ్యోతి, కర్రీ. శివ,బెజవాడ. శిరీష, కోఆప్షన్ సభ్యురాలు వంటేపాక. జానకి మున్సిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.