ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి

ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి

మహేశ్వరుడి దీవెనలు ఉండాలి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ, అక్షిత ప్రతినిధి :
రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా మహేశ్వరుడు దీవించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి నల్గొండ జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహాశివరాత్రి సందర్బంగా శుక్రవారం అయన నల్గొండ పట్టణంలోని పానగల్ పచ్చల సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజలు నిర్వహించేందుకు వచ్చిన రోడ్లు, భవనాలు , సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆలయ చైర్మన్, ప్రధాన అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయంలో అభిషేకం తో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనం అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతదేశంలోనే ఆధ్యాత్మికపరంగా, ఆర్కియాలజీ పరంగా ప్రత్యేకమైన దేవాలయాలు నల్గొండలోని పచ్చల సోమేశ్వరాలయం,చాయా సోమేశ్వరాలయాలు విలసిల్లుతున్నాయన్నారు.

ఛాయా సోమేశ్వరాలయాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆర్కేయాలజీ నిపుణులు వచ్చి పరిశీలించారన్నారు.
ఇంతటి మహత్యం కలిగిన ఈ ఆలయాలలో పూజలు జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు.వచ్చే సంవత్సరం శివరాత్రి నాటికి ఈ ఆలయాలన్ని మరింత అభివృద్ధి చేస్తామని,శివరాత్రి పర్వదినం రోజునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సైతం రావడం చాలా సంతోషమని తెలిపారు.

సమాజంలోని మహిళలు అన్ని రంగాలలో ముందుకు వచ్చి అభివృద్ధి చెందాలని, తమది మహిళల సంక్షేమం కోరే ప్రభుత్వమని, ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించామని,మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించి ఆలయాలను సందర్శించుకోవడం చాలా సంతోషం కలిగిస్తున్నదని అన్నారు.ఇప్పటికే మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు.త్వరలోనే భద్రాద్రి రామయ్య పాదాల దగ్గర మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయబోతున్నామని,ప్రతి మహిళకు ,మహిళా సంఘాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.మంత్రితో పాటు, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఆలయ చైర్మన్ సూర మహేష్, స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల రాజేశ్వరి మోహన్ బాబు,పలువురు కౌన్సిలర్లు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking