సుధాబ్యాంకు ద్వారా భవన నిర్మాణాల కోసం రుణాలు

సుధాబ్యాంకు ద్వారా భవన నిర్మాణాల కోసం రుణాలు

సుధాబ్యాంకు చైర్మన్ మీలా మహదేవ్

సూర్యాపేట/ అక్షిత ప్రతినిధి:
సూర్యాపేట పట్టణంలోని బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు, గృహ నిర్మాణ రంగంలో ప్రసిద్ధి చెందిన వ్యాపారులతో సుధాబ్యాంకు ఆధ్వర్యంలో ఆదివారం నాడు స్ధానిక బాలాజి గ్రాండ్ నందు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్యాంకు చైర్మన్ మీలా మహదేవ్, డైరెక్టర్ లు కక్కిరేణి చంద్రశేఖర్, ఏపూరి శ్రవణ్, భోనగిరి భాస్కర్ , మీలా సందీప్ , వైస్ చైర్మన్ పొనుగోటి నిర్మల పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా లో ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ నమ్మకానికి మారుపేరుగా నిలిచిన సుధాబ్యాంకు నందు భవన నిర్మాణ రంగంలో రుణాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు సుధాబ్యాంకు చైర్మన్ మీలా మహదేవ్ అన్నారు. లక్ష రూపాయల రుణానికి నెలకు 1200/- ఇఎమ్ ఐ ప్రకారం 15 సంవత్సరాల పాటు చెల్లించాలని అన్నారు. తమ బ్యాంకు 6 బ్రాంచ్ లతో 235 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుందని ఆయన అన్నారు. 30 లక్షల రూపాయల వరకు ప్రాధాన్యత రుణాలుగా పరిగణిస్తామని అన్నారు. సూర్యాపేట చుట్టుపక్కల వెంచర్లలో నిర్మాణాలు చేస్తున్న వారు, టౌన్ షిప్ లలో అపార్ట్మెంట్ లలో ఫ్లాట్లు కొనే వారు రుణాల కోసం తమ బ్యాంకు ను సంప్రదించాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బ్యాంకు ఎండి పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ మాట్లాడుతూ సుధాబ్యాంకు నందు భవన నిర్మాణాలకు 12% వడ్డీతో ఎటువంటి అదనపు చార్జిలు లేకుండా రుణాలు అందజేస్తున్నట్లు చెప్పారు. జాతీయ బ్యాంకు లలో ఆర్బిఐ రెపొ రెట్లు పెంచిన ప్రతిసారి వడ్డీ రేట్లు పెరుగుతాయని, కాని తమ బ్యాంకు లో రుణం తీసుకున్నప్పటి వడ్డి రేటు మాత్రమే అమలులో వుంటుందని అన్నారు. లోన్లు సక్రమంగా చెల్లించే వారికి ఎటువంటి అదనపు చార్జిలు వుండవని అన్నారు. ఇంటి రుణాల కోసం లింక్ డాక్యుమెంట్ లు, 16 సంవత్సరాల ఇసి, న్యాయ నిపుణుల అభిప్రాయం, ఇంజనీర్ ద్వారా వ్యాల్యుయేషన్ అవసరం వుంటుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య మాట్లాడుతూ సుధాబ్యాంకు కస్టమర్ లకు మెరుగైన సేవలను అందిస్తుందని, తనతో పాటు తిరుమలగిరికి చెందిన పలువురు సుధాబ్యాంకు లో ఇటీవల ఇంటి నిర్మాణం కోసం రుణాలు తీసుకున్నారని, కేవలం వారం రోజుల్లోనే రుణం మంజూరు చేస్తున్నారని అన్నారు. తిరుమలగిరిలో సుధాబ్యాంకు బ్రాంచ్ ను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారులు మాట్లాడుతూ గృహ రుణాల కొరకు బ్యాంకు లో ప్రత్యేక సిబ్బంది ని నియమించాలని, మార్ట్ గేజ్ రుణాలు ఇవ్వాలని అన్నారు. సూర్యాపేట పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందని గాంధినగర్, ఐలాపురం, హైదరాబాదు రోడ్ లో భవన నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయ‌ని, కాబట్టి బ్యాంకు ద్వారా గృహ నిర్మాణ రుణాలు ఎక్కువగా ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రాజా, సూర్యాపేట బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మడిపల్లి శంకర్, ధర్మా రావు, అప్పం శ్రీనివాస రావు, తోట శ్యామ్ ప్రసాద్, చల్లా లక్ష్మి ప్రసాద్, నూకల వెంకట రెడ్డి, బొలిశెట్టి మధు, ఫరూక్, మీలా వంశి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking