ట్రస్మా మేడ్చెల్ జిల్లా కమిటీ నియామకం
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాత్రి యాదగిరి పర్యవేక్షణలో ఆదివారం మేడ్చల్ జిల్లా కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షుడు జేరిపోతుల నాగరాజు , ప్రధాన కార్యదర్శి గుంజడి అశోక్, కోశాధికారి కందునూరి పరశురామ్ గౌడ్ లు 2024-26 గాను ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ ఎన్నికలలో ఎలక్షన్ ఆఫీసర్గా ట్రస్మా స్టేట్ చీఫ్ అడ్వైజర్ శ్రీ యాదగిరి శేఖర్ రావు , అబ్జర్వ్ గా కే ఇన్నా రెడ్డి వ్యవహరించారు. ఈ ఎన్నికలలో జిల్లా వ్యాప్తంగా సుమారు 268 మంది పాఠశాల కరస్పాండెంట్స్, అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ,కోశాధికారులతో పాటుగా రాష్ట్ర సీనియర్ నాయకులు నల్లా భాస్కర్ రెడ్డి, భీష్మా రెడ్డి, రామకృష్ణ , సురభి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.