ఆదర్శ మున్సిపాలిటీగా
తీర్చిదిద్దుతా
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
నల్గొండ మున్సిపాలిటీని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంతోపాటు, నల్గొండ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.బుధవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని నల్గొండ బైపాస్ రోడ్ వద్ద 55 కోట్ల రూపాయల వ్యయంతో విలీన గ్రామాలలో నిర్మించనున్న సిసి రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్జీ కాలేజీ వద్ద కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న హెల్త్ అండ్ హైజిన్ స్ట్రీట్ ఫుడ్ కోర్టు పనులకు శంకుస్థాపన చేశారు.నల్గొండ జిల్లా అభివృద్ధికి అనేక పనులను చేపట్టినట్లు మంత్రి తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు.

తాగునీరు, శానిటేషన్, గ్రీనరీపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారించాలని,విలీన గ్రామాలలో 55 కోట్ల టిఎఫ్ ఐ డిసి నిధులతో నిర్మించనున్న డ్రైన్లు, సిసి రోడ్ల పనులకు నల్గొండ బైపాస్ రోడ్డులో శంకుస్థాపన చేశారు.పట్టణంతో పాటు చుట్టుపక్కల 326 కోట్ల రూపాయలతో పనులు, నల్గొండ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. 600 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అవుటర్ రింగ్ రోడ్డు పనులకు వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నామని, 6 లైన్ల ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జ్ రహదారి పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. నల్గొండ పట్టణ ప్రజలకు తాగునీరు, వినియోగించుకునే నీటికి ఇబ్బంది లేకుండా 10లక్షల లీటర్లు, 15 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 2 వాటర్ ట్యాంక్ లను చేపట్టామన్నారు.

20 కోట్ల రూపాయలతో నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నామన్నారు.కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న హెల్త్ అండ్ హైజిన్ ఫుడ్ స్ట్రీట్ పనులకు ఎన్జీ కళాశాల వద్ద మంత్రి శంకుస్థాపన చేశారు. 2000 మందికి భోజనం అందించే ఏర్పాటు చేశారు.హరే రామ హరే కృష్ణ సహకారంతోఅక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా నార్కెట్ పల్లిలో 25 వేల మంది కూలీలు, విద్యార్థులు,పని చేసుకునే వారికి 5 రూపాయలకే భోజనం అందించే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆరు నెలల్లో ప్రారంభానికి చర్యలు చేపడుతామని,రోడ్లు, డ్రైన్ల పనుల నాణ్యత విషయంలో ఇంజనీరింగ్ అధికారులు రాజీ పడొద్దు మంత్రి ఆదేశించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాకు 12,000 మంది హాజరుకాగా, 6000 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మే, జాబ్ నెలలో మరో జాబ్ మేళాలను నిర్వహిస్తున్నాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ఆర్ అండ్ బి ఎస్ ఈ రాజేశ్వర్ రెడ్డి ,ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.