మల్లారెడ్డి యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్

మల్లారెడ్డి యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్…

ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ నూతన కార్యాలయం ఘనంగా ప్రారంభం..

మేడ్చల్, అక్షిత బ్యూరో :
మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ గ్లోబల్ ట్రీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ అండ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ రెండు రోజులు ఏర్పాటు చేశారు. బుధవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, శ్రీకర్ ఆలపాటి పాల్గొన్నారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు దిశనిర్దేశం చేశారు. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ నూతన కార్యాలయం ప్రారంభించారు.

అనంతరం మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మన తెలుగు పిల్లలు అమెరికాలో చాలా మంది ఉన్నారు. మన పిల్లలకు ఉన్న తెలివి, స్మార్ట్ నెస్ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ప్రపంచంలో టాప్ సైంటిస్టలు కాని, టాప్ డాక్టర్స్ కాని, ఏ రంగంలో చూసుకున్న మన తెలుగువాళ్లే ఉన్నారు. అందుకే అప్లికేషన్ నుంచి, మంచి యూనివర్శిటి ఎంపిక విధానం వరకు అన్ని సక్రమంగా ఉండాలని, ఎంతో మంది మన పిల్లలు విదేశాల్లో చదివి, గొప్పగొప్ప వాళ్లు కావాలని ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ పెట్టడం జరిగింది. 26, 30 దేశాలలోని వారు ఏ యూనివర్శిటికి పోయినా మల్లారెడ్డి యూనివర్శిటి అందుకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తోందని నేను మాట ఇస్తున్నాను.

శ్రీకర్ అలపాటి మాట్లాడుతూ
విదేశాలలో చదువుకొనే విద్యార్థులు ఎక్కడికెక్కడికో వెళ్లకుండా అన్ని సేవలు గ్లోబల్ ఎడ్యుకేషన్ నుంచి మల్లారెడ్డి యూనివర్శిటీలో అందించడం జరుగుతోంది. ఆఫర్ లెటర్, స్కాలర్ షిప్, వీసా గురించి అందించనున్నాం. విద్యార్థి ప్రొపెల్ బట్టి స్కాలర్ షిప్ కూడా ఇస్తారు. ఫారిన్ వెళ్లే విద్యార్థులకు ఏలాంటి అంక్షలు లేకుండా 60లక్షల వరకు మేము ప్రోవైడ్ చేస్తాం. విద్యార్థులకు సంబంధించిన అన్ని అనుమానాలను నివృత్తి చేసుకొవచ్చు. బుధవారం, గురువారం మల్లారెడ్డి యూనివర్శిటీలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఉంటుంది. దీనిని విద్యార్థులందరూ వినియోగించుకొవచ్చు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking