500రోజులుగా నిత్య అల్పాహార వితరణ

500రోజులుగా
నిత్య అల్పాహార వితరణ

డైమండ్ శ్రీనివాస్
సేవలు అభినందనీయం

*ఎమ్మెల్యే బిఎల్ఆర్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల వెంట వచ్చే సహాయకులకు లయన్స్ క్లబ్ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రాం చైర్మన్ మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య ఉచిత ఆల్పహార వితరణ కార్యక్రమం గురువారం నాటికి 500వ రోజుకు చేరుకుంది. లయన్స్ క్లబ్ మిర్యాలగూడ లయన్ వందనపు ప్రతాప్ పుట్టినరోజు సందర్భంగా సుమారు 300 మందికి అల్పాహార వితరణ చేశారు.

ముఖ్య అతిథులు లయన్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్, మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ తీగల మోహన్రావు డిస్టిక్ గవర్నర్ శివప్రసాద్, మీల్స్ ఆన్ వీల్స్ మేనేజింగ్ డైరెక్టర్, కోఆర్డినేటర్ రాధాకృష్ణ, మాజీ డిస్టిక్ గవర్నర్ కేఎన్ ప్రసాద్, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ మాట్లాడుతూ 500 రోజుల నుంచి నిరంతరముగా నిత్య అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్న డైమండ్ శ్రీనివాస్ టీం సభ్యులకు అభినందనలు తెలిపారు. లయన్స్ క్లబ్ సేవలు నిరంతరం కొనసాగించాలని ఆయన కోరారు. అభినందన ఆశీర్వచన కార్యక్రమంలో డైమండ్ శ్రీనివాస్ టీం సభ్యులకు ఎమ్మెల్యే బిఎల్ఆర్ సన్మానించారు. అనంతరం వారు ఎమ్మెల్యే బిఎల్ఆర్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి యనగండ్ల లింగయ్య, కోశాధికారి బాబురావు లయన్ లీడర్స్ లయన్ మురళీధర్ రెడ్డి, ముక్కపాటి వెంకటేశ్వరరావు, గుండా రామారావు, రాయపూడి జగన్మోహన్రావు, బిఎం.నాయుడు, లయన్స్ క్లబ్ సిజెఎస్ఎస్ దివ్యాంగ చార్టర్ అధ్యక్షులు కోల సైదులు ముదిరాజ్, కార్యదర్శి సింగు రాంబాబు, శంకర్రెడ్డి, గట్టు వెంకటేశ్వర్లు, సామ శ్రీనివాస్, మిట్టపల్లి విజయభాస్కర్, శంకర్ నాయక్, నీలా మోహన్ రావు, ఐ టెక్నీషియన్ రమేష్ పాల్గొనగా వాలంటీర్ రఫీను సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking