మిల్లర్ల మొండి
వైఖరి విడనాడాలి
ఎమ్మెల్యే బిఎల్ఆర్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
రైస్ మిలర్లు మొండి వైఖరి విడనాడి రైతుల ధాన్యాన్ని అన్ని మిల్లుల యాజమాన్యాలు కొనుగోలు చేయాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ హెచ్చరించారు. శుక్రవారం మిర్యాలగూడ నియోజకవర్గంలో రైతులు ఫిర్యాదు చేసిన పలు రైస్ మిల్లులను సందర్శించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోబొమన్నారు. ధాన్యం ధర విషయంలో కూడా రైతులకు అన్యాయం చేయకూడదని రైస్ మిల్స్ యాజమాన్యాలను హెచ్చరించారు.

అలాగే ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు చేసినా కూడా కొన్ని చోట్ల రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. రోజుల తరబడి రైతుల సహనాన్ని అమాయకత్వంగా భావించవద్దని ఆయన అన్నారు. ఇలాగే మొండివైఖరి అవలంబిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.