క్రీస్తు చూపిన సన్మార్గంలో నడవాలి

క్రీస్తు చూపిన సన్మార్గంలో నడవాలి

పాస్టర్ రెవ. డా. స్పర్జన్ కుమార్
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
ప్రపంచ మానవాళి పాప పరిహారార్థము నిమిత్తము సిలువలో తన ప్రాణాలను అర్పించిన ఏసుక్రీస్తు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ రెవ. డా. స్పర్జన్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సెంటినరీ బాప్టిస్ట్ ఆధ్వర్యంలో చిన్నారులతోపాటు మహిళలు, సంఘ పెద్దలు కలిసి క్రీస్తు బోధనలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ స్పర్జన్ కుమార్ మాట్లాడుతూ నాడు ఏసుక్రీస్తు ప్రభువు జెరూసలేం వీధుల గుండా వెళుతుంటే ఖర్జూర, ఈత మట్టలతో ఆయనకు స్వాగతం పలుకుతూ దేవాలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారని, ఆనాటి ఆనవాయితికి నిదర్శనంగా ప్రతి ఏటా మండల కేంద్రంలో సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో మట్టలాదివారం పేరుతో ర్యాలీగా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సెంటినరీ బాప్టిస్ట్ చర్చి ఉపాధ్యక్షులు పుట్టల జోసెఫ్ డేనియల్, కార్యదర్శి దైద సాల్మన్ రాజ్, కోశాధికారి పుట్టల నతానియల్, కార్యవర్గ సభ్యులు పుట్టల ఇమాన్యుయల్, మాతంగి డానియల్, తీగల జాన్, స్త్రీల అధ్యక్షురాలు పుట్టల వజ్రమ్మ సామ్యేల్,సండే స్కూల్ సూపరింటెండెంట్ పుట్టల విజయ ప్రేమ్ కుమార్, అసోసియేట్ సూపరిండెంట్ బొంగర్ల సమాధాన రాజ్, స్త్రీల కార్యదర్శి పుట్టల హేమలత, యూత్ డైరెక్టర్ పుట్టల అబ్రహం, సండే స్కూల్ టీచర్లు ప్రీతి అశోక్, పుట్టల రాధిక, పుట్టల శైలజ, పుట్టల జ్యోతి, పుట్టల కవిత, దైద కవిత, లుధియా, దైద నిర్మల, వలపట్ల సుధాకర్, పుట్టల పౌల్, పుట్టల శాంతి కుమార్, తర్రి చరణ్ విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking