అట్టహాసంగా గ్రామీణ క్రీడాపోటీలు షురూ

అట్టహాసంగా గ్రామీణ క్రీడాపోటీలు షురూ

_ కబడ్డీ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
మండలంలోని ఆమనగల్లు గ్రామంలో కొలువైన శ్రీపార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణం సందర్బంగా నిర్వహించే జాతరను పురస్కరించుకొని దేవాలయకమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రామీణ క్రీడా పోటీలు శనివారంఅట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రీడా పోటీలను ప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లతో కలిసి ఎమ్మెల్యే బిఎల్ఆర్ కబడ్డీ కోలాటం పోటీలను ప్రారంభించారు. క్రీడా పోటీలను ప్రారంభించేందుకు అమనగల్లు కు వచ్చిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కి కాంగ్రెస్ కార్యకర్తలు డిజె సౌండ్ తో మహిళల కోలాట ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయాగ దేవాలయ అర్చకులు మణిశర్మ, సూరి శర్మ అభిషేకం నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వేయ్యేళ్లకు పైగా ఘనమైన పురాతన చరిత్ర కలిగిన దేవాలయం శ్రీపార్వతి రామలింగేశ్వర దేవాలయమని ఈ దేవాలయం జిల్లాలోనే ప్రసిద్ధ పేరుగాంచి భక్తులు కోరిన కోరికలు తీర్చే మహిమలు కలిగిన దేవాలయంగా పెరుగుంచిందన్నారు. పురాతన సాంస్కృతి సంప్రదాయాలను పదిలపర్చి భవిష్యత్ తరాలను అందించేందుకు కృషిచేయాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇవ్వనపట్టికి గ్రామంపై ఉన్నటువంటి ప్రేమానురాగాలతో ఆలయ కమిటీ చైర్మన్ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, ఎంపీపీ పుట్టల సునీత , జిల్లాకాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షురాలు పత్తిపాటి స్వరాజ్యలక్ష్మి, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు భయ్యా సైదులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలి కాంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ మండల అధ్యక్షులు కోల పెద్ద సైదులు,దేవాలయ ధర్మకర్తలు లొండ కలమ్మ , పెరుమాండ్ల జోజి ,కొండ వెంకటేశ్వర్లు ముత్యాల యుగంధర్, కాంగ్రెస్ మండల రేగట్టి రవీందర్ రెడ్డి, రావు ఎల్లారెడ్డి, నాయకులు బీరవోలు సతీష్ రెడ్డి, కోల సైదులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking