హోళీ… కేరింతల ఖేలీ

మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు
హోళీ శుభాకాంక్షలు
* అందరి జీవితాల్లో నిత్య వసంతం వెల్లివిరియాలి 

బీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్దార్ధ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ యువనేత, ఎన్బీఆర్ (నల్లమోతు భాస్కర్ రావు) ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో నిత్య వసంతం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురుతో కొత్తదనం సంతరించుకొని, వినూత్నంగా పునఃప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోళీ పండుగ స్వాగతం పలుకుతుందని అన్నారు. చిగురించే ఆశలతో తమ జీవితాల్లోకి నూతనత్వాన్ని హోళీ రూపంలో స్వాగతం పలికే భారతీయ సంప్రదాయం రమణీయమైనదని తెలిపారు. హోళీ నేపథ్యంలో పల్లెల్లో వెన్నెల నవరాత్రుల్లో సాగే చిన్నారుల జాజిరి ఆటాపాటలతో, కోలాటాల చప్పుళ్లతో ఉత్తేజం వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా సింగిడి రంగుల నడుమ కేరింతలతో సాగే హోలీ.. మానవ జీవితమే ఒక వేడుక అనే భావనను, ప్రకృతితో మమేకమై జీవించాలనే తత్వాన్ని అందిస్తుందని తెలిపారు. భేదభావాలను వీడి పరస్పర ప్రేమ, అభిమానాలను చాటుకొంటూ ప్రజలందరూ మోదుగుపూల వంటి సహజసిద్ధమైన రంగులతో హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ హయాంలో చేపట్టిన ప్రగతి కార్యాచరణ.. తెలంగాణలోని దళిత, బహుజన, సకలజనుల జీవితాల్లో నిత్య వసంతాన్ని నింపిందని నల్లమోతు సిద్దార్ధ గుర్తు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking