కన్జర్వేషన్ జోన్ లో బిల్డర్ ఆగడాలకు అడ్డుకట్టపడేనా.?
నిబంధనలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు..
కన్జర్వేషన్ జోన్ లో ప్రజా ప్రతినిధులకు పంట అధికారుల అండ పురపాలక ఆదాయానికి గండి…
చేతివాటాలకు అలవాటుపడ్డ టౌన్ ప్లానింగ్ సెక్షన్ చైన్ మెన్…
మేడ్చల్, అక్షిత బ్యూరో : దుండిగల్ పురపాలక పరిది బౌరంపేటలో కంజర్వేషన్ జోన్ లో ఎటువంటి అనుమతులు లేకుండా ఇప్పటికే ఆరు విల్లాల నిర్మాణం చేపట్టిన సదరు బిల్డర్ మరో అడుగు ముందుకేసి 400 గజాల స్థలంలో 6 అంతస్తుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు,చర్యలు తీసుకోవాల్సిన పురపాలక అధికారులు వెనకడుగు వేస్తుండడం పలు అనుమానాలకు తావిస్తుంది, వినికిడి కంజర్వేషన్ జోన్ లో అనుమతులు పొందాలంటే 5 గురు మంత్రులతో కూడిన క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి లేదా పూర్తి స్థాయిలో ఎల్.ఆర్ ఎస్ కట్టివుండాలి,నిబంధనలు ఉల్లంగిస్తూ అడ్డగోలుగా అక్రమనిర్మానులు చేపడుతున్నట్లు బలంగా విమర్శలు వినిపిస్తున్నాయి..కంజర్వేషన్ జోన్ లో నిర్మాణాలు చేపట్టాలంటే క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి బౌరంపేట గ్రామపరిధిలోని ఆర్కే టౌన్షిప్ ను ఆనుకొని సుమారు 2 ఎకరాల కంజర్వేషన్ జోన్ లో నిబంధనలను ఉల్లంగిస్తూ ఓ బడా నిర్మాణ సంస్థ అక్రనిర్మాణాలకు బిల్డర్ గతంలో ఇదే తరహాలో గ్రామంలో అక్రమనిర్మాణాలు చేపట్టునట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

–తనదైన శైలిలో చక్రం తిప్పుతూ చేతి వాటాలకు అలవాటుపడ్డ టౌన్ ప్లానింగ్ సెక్షన్ చైన్ మెన్..కథ ఇంత అంత కాదు…
చైన్ మెన్ చేసే ఏరియాలో ఏలాంటి అక్రమ షెడ్లకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలకు పురపాలక ఆదాయానికి గండిగొట్టే విధంగా తనదైన శైలి చక్రం తిప్పుతూ.అవినీతి సంపాదనకు అలవాటు పడ్డ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ముడుపులతో సరిపెడుతూ పలు అనుమానాలకు తగుస్తుందని వినికిడి. ఇప్పటికీ టౌన్ ప్లానింగ్ విభాగంలో సెక్షన్ ఛైన్ మె న్ లు చేతివాటాలకు అలవాటు పడ్డట్లు వినికిడి.అక్రమనిర్మాణదారునికి పరిక్షంగా సహకరిస్తున్నట్లు విమర్శలు బలంగా.వినిపిస్తున్నాయి,గతంలో పూర్తి స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారి డి.పి.ఓ. సరిగా సైడ్ల మీదికి విజిట్ చేయలేక పోవడంతో కింది స్థాయి సిబ్బంది చెప్పిందే వేదం అన్నట్లుగా ఇప్పటికీ చైన్ మెన్ కొనసాగింది.స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అక్రమనిర్మాణాలు జరుగుతున్నట్లు సమాచారం ప్రజాప్రతినిధుల సహకారంతోనే సదరు నిర్మాణదారుడు బరితెగిస్తున్నట్లు సమాచారం. పురపాలక టిపిఓ సంజునను అక్షిత బ్యూరో వివరణ కోరగా చట్టాన్ని ఉల్లంగిస్తూ అక్రమనిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు..