ఖమ్మం/అక్షిత బ్యూరో :
పవిత్ర రంజాన్ మాసం ఎంతో పుణ్యాల మాసమని విజేత ఫౌండేషన్ అధినేత్రి ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణాధికారి వేల్పుల విజేత అన్నారు.పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలో అర్హులైన 65 మంది నిరుపేద ముస్లింలకు విజేత ఫౌండేషన్ అధినేత్రి ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణాధికారి వేల్పుల విజేత ఆధ్వర్యంలో రంజాన్ కీట్స్ పంపిణీ చేశారు.
ఈసందర్భంగా వేల్పుల విజేత మాట్లాడుతూ రంజాన్ మాసంలో జకాత్ ఫిత్రా రూపంలో దానధర్మాలు చేసే ప్రత్యేక మాసమని అందుకే ఈ రంజాన్ మాసాన్ని ఈద్-ఉల్-ఫితర్ అంటారని ఆమె అన్నారు.నిరుపేద ముస్లింలకు రంజాన్ పర్వదినోత్సవం రోజున సేమియా భోజన సదుపాయాలకు సంబంధించిన నిత్యావసరాల వస్తువులు బియ్యం సేమియా డ్రై ఫ్రూట్స్ పంచదార ఆనియన్స్ డాల్డా రిఫైండ్ ఆయిల్ వెయ్యి రూపాయల విలువ గల ఒక్కో కిట్ పండుగ సామాగ్రిని 65 మంది నిరుపేద ముస్లిం మహిళలకు అందించడం తన అదృష్టంగా భావిస్తున్నారని ఆమె అన్నారు. ప్రతి రంజాన్ పర్వ దినోత్సవం రోజున నిరుపేద ముస్లింలకు తనవంతుగా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసిన జర్నలిస్ట్ జానీపాషాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.అనంతరం కిట్స్ అందుకున్న నిరుపేద ముస్లిం మహిళలు వేల్పుల విజేతకు ధన్యవాదాలు తెలిపారు.