పేదవారికి ఉచితంగా వైద్య సేవలు…
చర్చి గాగిల్లాపూర్ లో ఉచిత మళ్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్..
సంవత్సరానికి 365 ఉచిత మోకాళ్ల ఆపరేషన్లు చేస్తాం డాక్టర్ గురవారెడ్డి..
చిన్నపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు ..
ఉమా చిగురుపాటి…
మేడ్చల్, అక్షిత బ్యూరో :
పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యాన్ని పంచాలనే లక్ష్యంతోనే సర్వేజనా ఫౌండేషన్ అధ్వర్యంలో ఉచితంగా మోకాళ్ల నొప్పులతో బాధపడే వారికి గుర్తించి వారికి ఉచితంగా మొకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను గ్రాన్యూల్స్ ఇండియా సహకారంతో నిర్వహిస్తున్నట్లు కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సర్వేజస ఫౌండేషన్ చైర్మన్ చైర్మన్ డాక్టర్ గురవారెడ్డి తెలిపారు. ఆదివారం దుండిగల్‌గండిమైనమ్మ మండలం పరిధిలోని చర్చి గాగిల్లాపూర్‌లో ఉచిత మళ్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ హెల్త్ క్యాంప్‌ను గ్రాన్యూల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా చిగురుపాటితో కలిసి డాక్టర్ గురవారెడ్డి క్యాప్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ సర్వేజన ఫౌండేషన్ అద్వర్యంలో పేదవారికి ఉచితంగా వైద్యసేవలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించాం. మొట్టమొదటి సారిగా మొబైల్ ఎక్స్‌రే వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి మొట్టమొదటి క్యాంప్‌ను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మోకాళ్ల నొప్పులతో బాధపడే నిరుపేలకు సంస్థ అధ్వర్యంలో ఉచితంగా మోకాళ్ల మార్ఫిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని తెలిపారు. రోజుకు ఒకరికి చొప్పున సంవత్సరానికి 365 అపరేషన్లు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇందుకోసం గ్రాన్యూల్స్ ఇండియా ముందుకు వచ్చి సహకరించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం గాస్యూల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా చిగురుపాటి మాట్లాడుతూ గ్రాన్యూల్స్ ఇండియా అధ్వర్యంలో అపరేషన్లు చేయించుకోలేని నిరుపేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నామని, ఇప్పటి ఉచిత కంటి శస్త్రచికిత్సలు, రాబోయే రోజుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేయించే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గుండె సంబంధ సమస్యలతో బాధపడే చిన్న పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం మళ్లీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్‌లో ఎక్స్‌రే, గైనకాలజీ, జనరల్ మెడిసిన్ వైద్యులు క్యాంపుకు వచ్చిన వారిని పరీక్షించి మందులను అందజేశారు. మోకాళ్ల మార్పిడికి అర్హులైన వారిని ఎంపిక చేసి శస్త్రచికిత్సను నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్య శిభిరంలో కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ ఆదర్శ్ అన్నపరెడ్డి, డాక్టర్ కుశాల్ హిప్పాల్ గోవంకర్, డాక్టర్ దివాకర్‌రెడ్డి, సర్వేజన ఫౌండేషన్ వైస్ చైర్మన్ రాము ఎలమంచలి, స్థానిక కౌన్సిలర్ సుధాకర్‌రెడ్డి, గ్రాన్యూల్స్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు.