గొందళి సమజ్ సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

గొందళి సమజ్ సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : ఏకనాథ్ దునిగే

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

గొందళి సమాజ్ సంఘం అభ్యున్నతికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన గొందళి సమాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏక్నాథ్ దునిగే.ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు.

తిరిగి వారికె పూలమాల వేసిన సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం ఏక్ నాథ్ దనిగే మాట్లాడుతూ గొందళి సమాజ్ సంఘం అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని ప్రత్యేక కార్పొరేషన్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.ఈ కార్యక్రమంలో గొందళి సమాజ్ సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు,వెంకట యాదవ్, బస్సు రాము,తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking