జిల్లావ్యాప్తంగా 370 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
డిఆర్ డిఏ పిడి నాగిరెడ్డి
వేములపల్లి, అక్షితప్రతినిధి:
రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ అందిస్తున్న మద్దతు ధరను పొందాలని డిఆర్ డిఎ
పిడి నాగిరెడ్డి అన్నారు. సోమవారం వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో వరి కోతలు పూర్తయిన ప్రాంతాలలో రైతులు సౌలభ్యం కోసం ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 370 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అయన కోరారు.ఈ కార్యక్రమంలో వేములపల్లి ఎపిఎం మహమ్మద్ నిజమోద్దీన్, సిసి రమణయ్య తోపాటు ఐకెపి సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.