తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఖమ్మంలో ఇఫ్తార్ వింధు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లాలో పని చేస్తున్న ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీఓ) సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఖమ్మం టీజీవో భవన్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కార్యదర్శి ఎ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చి ఏకం చేసేందుకు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే తొలిసారిగా ఇఫ్తార్ విందును ప్రారంభించామని తెలిపారు.ఉద్యోగులకు అండగా ఉంటానని తెలిపారు.

టీజీఓ నూతన రాష్ట్ర కార్యవర్గం మొదటీ సారి ఖమ్మం వచ్చిన సందర్భంగా నేతలకు శాలువాలతో జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్ర మంలో టీజీఓ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నయూమ్ బాషా ఎన్వీ కృష్ణారావు జేవీ రామకృష్ణ సతీశ్ శ్రీనివాస రావు టీజీవో ఖమ్మం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కస్తాల సత్యనారాయణ మోదుగు వేలాద్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంగం వెంకట పుల్లయ్య విజయ్ కుమార్ ఖమ్మం జిల్లా టీఎన్జీఓ సంఘం నాయకులు కొణిదల శ్రీనివాసరావు గుంటుపల్లి శ్రీనివాసరావు పొట్టపింజర రామయ్య గంగవరపు బాలకృష్ణ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉద్యోగులు పాల్గోన్నారు.