ఆర్థిక సాయం అందజేత
అక్షిత న్యూస్, మాడ్గులపల్లి : మండలం లో ఇందుగుల గ్రామానికి చెందిన ఫెర్టిలైజర్ డీలర్ తోట శ్రీను వారం రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ తో అకాల మరణం చెందాడు. అతని కుటుంబాన్ని సోమవారం మాడ్గులపల్లి మండల ఫెర్టిలైజర్స్ షాప్స్ యూనియన్ సభ్యులు పరామర్శించి రూ.40వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సైదా నాయక్, యూనియన్ అధ్యక్షుడు మీలా రాంబాబు, కార్యదర్శి కట్టా సిద్దార్థ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు నాతాల రాంరెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, నాగేశ్వర రావు, సైది రెడ్డి,గురవయ్య, దయాకర్, రాములు తదితరులు పాల్గొన్నారు.