భువనగిరి కోటపై ఎగిరేది బిజెపి జెండానే
– ప్రజల తనను ఆశీర్వదించాలి
– అటు దేశం ఇటు రాష్ట్రం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మరోసారి ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలి
– ఖాళీ బిందెలు కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయండి
లంకె బిందెలు కావాలంటే బిజెపికి ఓటేయండి
రామన్నపేట మండలన్ని అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తా
– మండలంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పరిశ్రమలు నెలకొల్పడానికి కృషి చేస్తా
– భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
భువనగిరి కోటపై ఎగిరేది బిజెపి జెండానే అని భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.రామన్నపేట మండలంలో ఇంద్రపాలనగరం, భోగరం, సిరిపురం, రామన్నపేట పట్టణ కేంద్రంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖాళీ బిందెలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, లంకె బిందెలు కావాలంటే బిజెపికి ఓటెయ్యాలని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొంది మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని, బిజెపి అధికారంలోకి వస్తుందన్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు దూరంగా మచ్చలేని ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందన్నారు. దేశం మొత్తం మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటునారని అన్నారు.

సామాజిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో గత నాలుగు ఐదు దశాబ్దాలుగా జరిగినటువంటి పనులను కేవలం 10 సంవత్సరాల్లో చేసి చూపిన ఘనత నరేంద్ర మోడీది అని అన్నారు. దేశంలో డిజిటల్ పేమెంట్స్ తీసుకొచ్చిన ఘనత మోడీకే దక్కింది అని అన్నారు. ఆర్థిక అభివృద్ధిలో భారతదేశాన్ని 11వ స్థానం నుంచి ఐదవ స్థానానికి పెంచారని అన్నారు.5000 కిలోమీటర్ల జాతీయ రహదారులనుబిజెపి ప్రభుత్వం వచ్చిన నిర్మాణం నిర్మించామని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంద్రధనస్సు కార్యక్రమం క్రింద ప్రతి టీకాను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్నారు. 80 లక్షల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నామని అన్నారు. రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దేవుడు అయితే, 60 రూపాయలకు కిలో బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్న మోడీ మహాదేవుడవు అని అన్నారు. రాష్ట్రంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలకు, రైతు వేదికలకు. కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుందని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం పై వ్యతిరేకతో కాంగ్రెస్ కు ఓటేశారని అని , అమలు చేయలేని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు.

రామన్నపేట మండలం అభివృద్ధి పథంలోకి రావాలంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తనకు ఓటు వేయాలని కోరారు.పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలిస్తే ప్రధాని మోడీని ఒప్పించి మండలంకు పరిశ్రమలను తీసుకువస్తానని,విద్యా విషయంలో ఉన్నత విద్య కేంద్రాలను నెలకొల్పుతానని అన్నారు. పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని మరోసారి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం మొత్తం శెట్టి రవీందర్ కర్నాటి ధనంజయ రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ చంద్రశేఖర్ జిల్లా కార్యదర్శి శివకృష్ణ మండల అధ్యక్షులు పల్లపు దుర్గయ్య బీజేపీ నాయకులు కన్నెకంటి వెంకటేశ్వరాచారి కొమ్ము యాదయ్య సిందం లింగయ్య కూనూరు సుధాకర్ సుర్వి హరిబాబు యాదాసు లక్ష్మణ్ తాటిపాముల లింగస్వామి గుంటూరు కృష్ణమాచారి గట్టు బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు