తెలుగు ప్రజలకు శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ
వరంగల్, అక్షిత బ్యూరో :
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ ను పురస్కరించుకొని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది ఆగమనంతో కాలం శిశిర రుతువును వీడి, వసంత రుతువులోకి ప్రవేశించినట్లుగానే, తెలంగాణ రాష్ట్రం నియంతృత్వ పాలన నుంచి సంక్షేమ పాలనలోకి అడుగిడిందని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతి అడుగు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేస్తూ, సంక్షేమరాజ్యాన్ని స్థాపించే దిశగా సాగుతుందని అన్నారు. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ ప్రజలంతా ఉగాది పండుగకు స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరూ సకల సంపదలతో వర్ధిల్లాలని మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు.