రంజాన్  అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి

రంజాన్  అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి

అల్లా దీవెనలతోనే రంజాన్ మాస ఉపవాస దీక్షలు విజయవంతం

కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ ఖాద్రి రషాదీ

కోదాడ, అక్షిత ప్రతినిధి :

రంజాన్ పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు కలుగ జేయాలని కోదాడ పెద్ద మసీదు ఇమాం మౌలానా అబ్దుల్ ఖాద్రి రషాదీ అన్నారు. గురువారం రంజాన్ పండుగ సందర్భంగా సాలర్జంగ్ పేట ఈద్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మాట్లాడారు.రంజాన్ లో పాటించిన నైతిక జీవనం కొనసాగించాలని కోరారు. అల్లా దీవెనల తోనే రంజాన్ మాస ఉపవాస దీక్షలు విజయ వంతం అయ్యాయన్నారు.

ముస్లిం సోదరులు ఒకరికి ఒకరు ఆ లింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో బాబు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మౌలానా మహమ్మద్ అహ్మద్ నద్వి, హమీద్ మౌలానా కౌన్సిలర్లు మథర్ సాహెబ్,షఫీ, షాబుద్దిన్ మైనార్టీ నాయకులు అల్తాఫ్ హుస్సేన్, ఎస్.కె నయీమ్, బాజాన్ ఖాజమైనోద్దీన్,బాగ్దాద్, బాషమియా, ఎజాజ్,ముస్తఫా, శంమీ , బాబా,మాజారోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking