దండ ఆశయ సాధనకు కృషి
ఎమ్మెల్యే బిఎల్ఆర్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ఎన్ఎస్ యూఐ మాజీ జిల్లా అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ స్వర్గీయ దండ శ్రీనివాస్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేద్దామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం దండ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక హౌసింగ్ బోర్డ్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డిలు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ మాట్లాడుతూ స్వర్గీయ దండ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ చిన్నతనంలోనే ఎన్నో పదవులను చేపట్టి విద్యార్థులకు అండదండగా ఉంటూ వారికి ఏ సమస్య వచ్చిన నేనున్నానంటూ ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి అని కొనియాడారు.

ఆయన మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి సల్పిన వ్యక్తి వారి ఆశయ సాధన కోసంమనమందరము పాటుపడాలని వారి కుటుంబానికి మనమందరము ఎప్పుడూ అండగా ఉండాలని వారన్నారు. మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ దండ శ్రీనివాస్ రెడ్డి చిన్నతనం నుండే ప్రతి ఒక్కరికి సహాయపడే మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారని, విద్యార్థి దశలోనే విద్యార్థుల సమస్యల కోసం పోరాటం చేసి అందరి మన్ననలు పొందిన వ్యక్తి అన్నారు. ఎన్ ఎస్ యు ఐ విద్యార్థులందరూ దండ శ్రీనివాస్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులందరికీ అండదండగా ఉంటూ ఎన్ఎస్ యూఐ ని విద్యార్ధి లోకానికి ఆదర్శంగా ఉంచాలని ప్రతి ఒక్క విద్యార్థికి నాయకులందరూ అండదండగా ఉంటూ వారి సమస్యలను తీర్చడంలో మేము ముందు ఉంటామని, అదేవిధంగా విద్యార్థులు చదువుకోవడంలో ముందుండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, అర్జున్, కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, గంధం రామకృష్ణ, రుణాల్ రెడ్డి, వార్డ్ ఇంచార్జ్ లు గుంజ శ్రీనివాస్, చల్లా వెంకన్న, బల్గూరి శ్రీనివాస్, మొల్లాల అమృతా రెడ్డి, గోవర్ధన చారి, కోడిరెక్క ఇంద్ర కుమార్, కరుణ, ఆకుల పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆనంతరం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో అల్పాహార వితరణ చేశారు.