నేను గులాబీని వీడేది లేదు
వరంగల్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని
వరంగల్, అక్షిత బ్యూరో:
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆయన అనుచరులు గులాబీని వీడి కమలం తో చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నన్నపునేని నరేందర్ గులాబీని వీడి కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధం ఐయినట్లు సమాచారం.నన్నపునేని గులాబీ ని వీడడం వరంగల్ తూర్పు నియోజకవర్గం లో బి ఆర్ ఎస్ కు భారీ కుదుపు గా భావిస్తున్నారు.రాష్ట్రంలో పార్టీ నేతలు ఇతర పార్టీలకు మారుతున్నందున మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం సాగుతోంది…. కాగ ఈనెల 13-15 న నన్నపునేని ఐదుగురు గులాబీ కార్పొరేటర్లు కాషాయం తీర్థం పుచ్చుకుంటూన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే బిజేపి శ్రేణులు మాజీ ఎమ్మెల్యే ను పలు మార్లు కలిసి చేరిక పై మార్గాలు అన్వేషించినట్టు సమాచారం ఇదే విషయమై మాజీ ఎమ్మేల్యే ను వివరణ కోరగా ఇదంతా ఫేక్ న్యూస్ అని తాను కారు పార్టీ వీడి ఇంకో పార్టీకి వెల్లేది లేదనీ కావాలని కొందరు గిట్టని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొట్టి పారేశారు. ఏది ఏమైనా కాలమే బావిష్యత్ నిర్ణయిస్తుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.